సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాన్ ఇండియా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెలుగు సినీ సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ వరల్డ్’ యాక్షన్ & అడ్వాంచర్స్ సినిమా కు సిద్ధం అవుతున్న నేపథ్యంలోఈ సినిమా కోసం మహేష్ బాబు ఇప్పటికే గెడ్డం లాంగ్ హెయిర్ మంచి కండల గంధరుడు గా లుక్ లోకి వారిపోయిన నేపథ్యంలో ఈ సినిమా ఫోటో షూట్ కోసం ఇటీవల ఫారిన్ వెళ్లి ప్రత్యేకంగా మేకోవర్ అయి వచ్చారు. అయితే ఇప్పుడు మహేష్ బాబు కొత్త అవతారం లో కనిపించి అందరికి షాక్ ఇచ్చాడు. మొన్నటి వరకు ఉన్న లాంగ్ హెయిర్, గెడ్డం ట్రిమ్ చేసి సహజమైన తన లుక్ లో దర్శనమిచ్చారు. తాజగా కీరవాణి తనయుడు శ్రీసింహా ఎంగేజ్ మెంట్ వేడుకకి మహేష్ బాబు హాజరయ్యారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్అవుతున్నాయి. అందులో మహేష్ బాబు తో పాటు ఇటీవల ఏపీ డిప్యూటీ స్పీకర్ గా పదవి అధిష్టించిన ఉండి ఎమ్మెల్యే రఘురామా కృష్ణంరాజు ఈ వేడుకలలో ప్రత్యేక ఆకర్షణగా తన పొలిటికల్ గ్లామర్ ను జోడించారు.
