సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఛత్తీస్‌గఢ్ (Chhattisgad) అడవుల్లో మరోసారి నేడు, శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోలు మృతిచెందినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల్లో మావోయిస్టు అగ్ర నేతలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను ఘటనా స్థలంలో గుర్తించినట్లు భద్రతా దళాలు తెలిపాయి. అలాగే మృతుల నుంచి భారీఎత్తున ఆటోమేటెడ్ ఆయుధాలు, ఏకే 47 సహా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇంకా ఎన్‌కౌంటర్ కొనసాగుతున్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు భద్రతా దళాలు తెలిపాయి.
