సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి వందలాది దీక్షాపరులచే నేటి శనివారం ఉదయం చీర రవిక, గాజులు, పసుపు కుంకుమలు, వివిధ రకాల పండ్లు, ఎన్నో రకాల మిఠాయిలు , పువ్వులతో శ్రీ అమ్మవారి కి సారె పెట్టె కార్యక్రమం స్థానిక మోటుపల్లి వారి వీధిలోని శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి పూరి గుడి నుండి ప్రారంభించి దేవాలయ ఆవరణ వరకు చేరి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి పవిత్రమైన సారె సమర్పించారు.ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి సారెను నైవేద్యంగా సమర్పించి తదుపరి, భక్తులకు, మాతలకు ప్రసాదంగా అంజేశారు ఈ కార్యక్రమాన్ని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు.
