సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు సీఎం చంద్రబాబు సర్కార్ శ్రీకారం చుట్టనుంది. అందుకోసం డిసెంబర్ 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ ప్రక్రియ డిసెంబర్ 28వ తేదీ వరకు కొనసాగుతోందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల్లో.. మార్పులు, చేర్పులు నమోదు చేసేందుకు,అలాగే అనర్హులకు రేషన్ కార్డ్స్ రద్దు కు కూడా అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో అనేక మంది తెల్ల రేషన్ కార్డులు పొందినట్లు? పిర్యాదులు కూడా ఉన్నాయి. వాటిలో నిజానిజాలు నిర్ధారిస్తారు. ఏది ఏమైనా సంక్రాంతి లోపు అర్హులను గుర్తించి.. వారికి రేషన్ కార్డులు అందజేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది..
