సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో శ్రీ రాజ్యశ్యామల యాగంతో ఆధ్యాత్మికంగా రాజకీయంగా అత్యంత ప్రాచుర్యం పొందిన విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామి కి ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఎదురు గాలి వీస్తుంది. గతంలో మాజీ సీఎం జగన్ కు అత్యంత ప్రియమైన గురువుగా పేరొందిన స్వరూపానందేంద్ర స్వామి శ్రీ శారద పీఠానికి “గురుదక్షిణ”గా జగన్ ఎన్నో ప్రభుత్వ భూములు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారని వాటిని తిరిగి తీసుకోవడం జరుగుతుందని ఇటీవల అసెంబ్లీ లో మంత్రి అచ్చేమ్ నాయుడు మాట్లాడటం కూడా జరిగింది. ఇదిలా ఉండగా తాజగా నేడు, మంగళవారం .. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తనకు కల్పిస్తున్న ఎక్స్(X) 1+1 భద్రతను వెనక్కి తీసుకోవాలని స్వరూపానందేంద్ర స్వామి కోరారు. ఇకపై రిషికేశ్‌లో తపస్సులోనే ఎక్కువ సమయం కేటాయించాలని భావించటంతో ఈ మేరకు గన్ మ్యాన్లను వెనక్కి తీసుకోవాల్సిందిగా ఏపీ డీజీపీ, విశాఖ పోలీస్ కమిషనర్‌కు శారదాపీఠం తరఫున లేఖ అందజేశారు. 2019 నుంచి 2024 వరకూ ( వైసీపీ ప్రభుత్వ హయం)తన భద్రతా, శ్రేయస్సు కోసం ప్రస్తుత, మునుపటి ప్రభుత్వాలు పోలీసు రక్షణ అందించాయని వారికీ కృతఙ్ఞతలు తెలుపుతున్నానని స్వామీజీ లేఖలో పేర్కొన్నారు.
