సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ లో నేడు, గురువారం వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలో ఆర్డీవోలు, జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్స్ సూపర్డెంట్లు, స్పెషలిస్టులు, వైద్యాధికారులతో జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి తో కలిసి సంయుక్తంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ.. జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్ లో మధ్యాహ్నం పూట నుండి స్పెషలిస్టులు రావడం లేదని ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని దీనిని దృష్టిలో పెట్టుకుని వైద్యాధికారులు, సిబ్బంది స్థానికంగా నివాసం ఉండాలని అప్పుడే ప్రజలకు మన వైద్యసేవలు పట్ల నమ్మకం కలిగి పేషెంట్ల సంఖ్య పెరుగుతుందని జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి అన్నారు. రేపటి నుండి ఫిర్యాదులకు స్వస్తి పలికేలా స్నేహపూరిత వైద్య సేవలను అందించి, పేషంట్లను అక్కున చేర్చుకోవాలని ఆదేశించారు. జిల్లాలో 34 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,18 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 4 ఏరియా హాస్పిటల్సు, 3 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు,1 జిల్లా హాస్పటల్ కు మొత్తం 64 మంది ప్రత్యేక అధికారులను ఆసుపత్రుల పర్యవేక్షణ నిమిత్తం నియమించడం జరిగిందని తెలిపారు. ప్రత్యేక అధికారులు ప్రతిరోజు ఆయా హాస్పిటల్ లో పనితీరు, డెలివరీలు, అవుట్, ఇన్ పేషంట్లకు అందుతున్న వైద్య సేవలు మరియు హాస్పిటల్స్ మంచి పురోగతి సాధించుటకు తీసుకోవాల్సిన అంశాలను పూర్తి అధ్యయనం చేసి, సాయంత్రానికల్లా జిల్లా కార్యాలయానికి పూర్తి నివేదిక అందజేయాలని , అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉదయం 9:00 గం.లు నుండి సాయంత్రం 4:00 గం.లు వరకు, అర్బన్ హెల్త్ సెంటర్లు ఉదయం 9:00 గం.లు నుండి సాయంత్రం 5:00 గం.లు వరకు,జిల్లా హాస్పటల్, ఏరియా హాస్పిటల్సు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు మూడు షిఫ్టులు ప్రకారం 24 గంటలు మనస్సు పెట్టి పని చేయాలని ఆదేశించారు. క్రింద స్థాయి ఉద్యోగి నుండి స్పెషలిస్టు డాక్టరు వరకు రోజుకి మూడు సార్లు యఫ్ఆర్వ్యస్ అటెండెన్స్ తప్పక వెయ్యాలని, జిల్లా కార్యాలయం నుండి పరిశీలన చేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *