సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నర్సయ్య అగ్రహారం లోని నివాసం వద్ద కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మను ప్రభుత్వ మాజీ విప్, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, గురువారం పరామర్శించారు. కేంద్ర మంత్రి తండ్రి సూర్యనారాయణ రాజు ఇటీవల మరణించిన నేపథ్యంలో .. స్వర్గీయ సూర్యనారాయణ రాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తండ్రి బాటలో శ్రీనివాస వర్మ క్రమశిక్షణతో నడుచుకుని అటు బీజేపీ పార్టీలోను, ఇటు ప్రజల్లోనూ ప్రజాదరణ తెచ్చుకున్నారని అన్నారు. శ్రీనివాస వర్మ కేంద్ర మంత్రిగా నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి తండ్రి ఆశయాలను నెరవేరుస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ కుటుంబానికి గ్రంధి శ్రీనివాస్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. గ్రంధి శ్రీనివాస్ వెంట ఎంపీపీ పేరిచర్ల విజయ నరసింహారాజు , తోట భోగయ్య తదితరులు ఉన్నారు.
