సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ కేంద్రంగా సాఫ్ట్ వేర్ కంపెనీల కోలాహలం మరింత పెరగనుంది. ఏపీలో ఎంతో ఆహ్లద వాతారవరణం ఉండే కాస్మో సిటీ వైజాగ్ కేంద్రంగా రుషికొండలో హిల్-2పై గత 3 ఏళ్లుగా ‘ఇన్ఫోసిస్’ మొదలు ఎన్నో ప్రఖ్యాత కంపెనీ లు వరుసగా టాప్ కంపెనీలు తమ కార్యాలయాలు ప్రారంభిస్తూ ఇక్కడి యువతకు ఉపాధిని ఇవ్వడం అందరికి తెలిసిందే.. దిగ్గజ సాఫ్ట్‌వేర్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) కూడా అతిత్వరలో విశాఖపట్నంలో కార్యకలాపాల ప్రారంభానికి మార్గం సుగమమైంది. తాజగా రుషికొండ ఐటీ పార్కు హిల్-2పై నాన్ సెజ్ ఏరియాలోని ‘డల్లాస్ టెక్నాలజీస్’ భవనాన్ని లీజుకు తీసుకొని అందులో కార్యాలయం నడపడానికి టీసీఎస్ ముందుకువచ్చింది. లీజు ఒప్పందానికి ఆమోదం తెలుపుతూ తాజగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో టీసీఎస్ తొలి దశలో రెండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. ఆ తరువాత మరింత విస్తరిస్తుంది. అమెరికాలోని ప్రఖ్యాత కంపెనీలు ఏపీకి వచ్చేలా చేస్తామని ఐటీ మంత్రి నారా లోకేశ్ కూడా ఇటీవల ప్రయత్నాలు వేగవంతం చేసారు. రుషికొండలో హిల్-2పై డీనోటిఫై చేసిన ప్రాంతంలోని డల్లాస్ టెక్నాలజీ ఎల్‌ఎల్‌పీ నూతనంగా నిర్మించిన భవనాన్ని ఎంపిక చేసుకున్నారు. ఇది ప్రఖ్యాత ఇన్ఫోసిస్ కార్యాలయం పక్కనే TCSఉండడం గమనార్హం
