సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వివాదాస్వాద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై చేసిన ట్విట్టర్ పోస్టులపై ఇటీవల వరుసగా కేసులు పెట్టి అతని అరెస్ట్ చేస్తామంటు తెలంగాణ, తమిళనాడులలో ఇప్పటికే APపోలీసులు ఆర్జీవీని అదుపులోకి తీసుకోవాలని విఫల యత్నం చేసిన ఘటనలు దేశవ్యాప్తంగా టీవీ ఛానెల్స్ లో ప్రజలు ఆసక్తిగా వీక్షించారు. గత నాలుగైదు రోజులుగా ఆర్జీవీ మాత్రం చక్కగా పెద్ద కప్ లో కాపీ తాగుతూ .. తాను తన ఇంట్లోనే ఉన్నానని,అసలు తనకు అరెస్ట్ వారెంట్ రాలేదని వీడియోలు, పలు ఛానెల్స్ లో గంటల కొద్దీ ఇంటర్వ్యూలు ఇస్తూ తనని ఎలా అరెస్ట్ చేస్తారంటూ? ఆలా సోషల్ మీడియా పోస్టులకే అరెస్ట్ చేస్తే దేశంలో 80 శాతం మంది జైలులోనే ఉంటారని సెటైర్స్ వేస్తూ తనదైన వాగ్ధాటి ప్రదర్శించిన విషయం అందరికి తెలిసిందే.. అయితే తాజా సమాచారం ప్రకారం.. నేడు, సోమవారం ఏపీ హైకోర్టులో వర్మ వేసిన క్వాష్ పిటిషన్ ని విచారించి ఆదేశాలు జారీ చేసింది. రామ్ గోపాల్ వర్మ కేసులో ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు విడుదల చేసింది. మరో ‘వారం రోజుల వరకు’ అంటే వచ్చే సోమవారం వరకు ఆర్జీవీని సోషల్ మీడియా పోస్టుల కేసుల విషయంలో అరెస్ట్ చెయ్యొద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది కోర్టు.
