సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుడు, భీమవరం గునుపూడి వాస్తవ్యుడు పాలపర్తి జోనా గత శనివారం అర్ధరాత్రి మృతి చెందారు. సుదీర్ఘకాలంగా పాలపర్తి జోనా దంపతులు ఉమ్మడిగా రాజకీయ కార్యక్రమాలలో పాల్గొనేవారు. భీమవరంలో కాంగ్రెస్ పార్టీ లో తమ ప్రస్థానం ప్రారంభించి గత దశాబ్దిగా వైసీపీ నేతలుగా స్థానిక మాజీ వార్డు కౌన్సెలర్స్, మార్కెట్ యార్డ్ సభ్యులుగా , పార్టీలో కీలక పదవులలో పాలపర్తి జోనా దంపతులు రాణించారు. రాజకీయాలకు అతీతంగాపాలపర్తి జోనా అందరికి అత్మియుడుగా వ్యవహరించేవారు. స్థానికుల సమస్యలను మునిసిపల్ అదికారులు దృష్టికి తీసుకొనివెళ్ళటం లో పాలపర్తి జోనా విశేష కృషి చేసేవారు. ఆయన మృతి కి సిగ్మా న్యూస్ తరపున ఆయన కుటంబానికి తీవ్ర సంతాపం తెలియజేస్తున్నాము.
