సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో పవిత్ర పంచారామ క్షేత్రం గునుపూడి లో వేంచేసి యున్న శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు గ్రామస్తులు, భక్తులు, సేవకులు, దేవదాయ ధర్మదాయ శాఖ అధికారుల సమక్షమంలో గత 53 రోజులకు గాను హుండీలు తెరచి లెక్కించగా రూ.26,42,447/-లు, అన్నదానం హుండీ ద్వారా రూ.2,05,975/- ఆధాయం వచ్చి యున్నది. ఈ లెక్కింపు కార్యక్రమంను వర్థినీడి వెంకటేశ్వర రావు, తనిఖీదారు, దేవదాయ ధర్మదాయ శాఖ, భీమవరం వారు పర్యవేక్షించగా, తోట శ్రీను, పి.టి.గోవిందరావు, కార్యనిర్వహణాధికార్లు పాలొన్నారు. ఇక కీలకమైన కార్తీకమాసోత్సవములు సందర్భముగా ది.02-11-2024 నుండి ది.01-12-2024 వరకు అనగా 30 రోజులకు గాను సేవల వలన రూ.1,80,244/-లు, దర్శనములు వలన రూ.47,50,400/-లు, కానుకలు/సమర్పణలు వలన రూ.23,327/-లు, అన్నదానం వలన రూ.29,61,411/-లు, ప్రసాదం అమ్మకములు వలన రూ.5,44,635/-లు, జనరల్ హుండీ వలన రూ.26,42,447/-లు, అన్నదానం హుండీ వలన రూ.2,05,975/-లు వెరశి మొత్తం మీద రూ.1,13,08,439/-లు ( ఒక కోటి పదమూడు లక్షల ఎనిమిది వేల నాలుగువందల ముప్ఫయ్ తొమ్మిది రూపాయలు )ఆధాయం వచ్చిందని దేవాలయ ఇఓ డి రామకృష్ణంరాజు తెలిపారు.
