సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండల ఆర్యవైశ్య సంఘం అధ్వర్యంలో అమరజీవి’ పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా భీమవరం పట్టణం మావుళ్ళమ్మ గుడి రోడ్డులోని పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి పలువురు నివాళులర్పించారు. ఆంధ్రరాష్ట్రం కోసం అలుసులు బాసిన అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిదని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కోయ్యే మోషేన్ రాజు, ఎపి రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు ఆయనకు ఘాన నివాళ్లు అర్పించారు. . ఆంధ్రుల కోసం ఆయన చేసిన త్యాగానికి అమరజీవి బిరుదు ఇచ్చారని, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి అమరజీవి యైన మహాపురుషుడు అని, ఆంధ్రులకు ప్రాత:. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణ భూతుడు, మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కోసం జీవితాంతం కృషిచేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములని కొనియాడారు. ఆర్యవైశ్య వర్తక సంఘం భవనం అధ్యక్ష, కార్యదర్శులు వబిలిశెట్టి వేంకటేశ్వర రావు, తటవర్తి బదిరి నారాయణ వబిలిశెట్టి రామకృష్ణ, ఇందుకూరి రామలింగరాజు, కారుమూరి సత్యనారాయణమూర్తి, కూటమి నేతలు ముచ్చకర్ల శివ, లంకి చిన్ని పాల్గొన్నారు.
