సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్; తెలంగాణాలో కారు రేస్ లకు గతంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50 కోట్లు అక్రమంగా ప్రభుత్వ సొమ్ము చెల్లించారని అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలు రచ్చ తో ఏసీబీ దర్యాప్తు ఆదేశాల నుండి నేడు, శుక్రవారం హైకోర్టు ఊరట నిచ్చింది. కొద్దీ గంటలు కాలేదు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ రూపంలో ఆయనకు మరో షాక్ తగిలింది. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్. కేటీఆర్‌పై కేసు నమోదైంది. పీఎంఎల్ఏ, మనీలాండరింగ్ కింద కేటీఆర్‌పై కేసు నమోదు చేసింది. ఏసీబీ కేసు ఆధారంగానే ఈసీఐఆర్ నమోదు చేసింది . ఇదిలా ఉండగా నేడు, శుక్రవారం లో హైదరాబాద్ లో ప్రముఖుల ఇండ్లపై ఏకకాలం లో 8 చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు రైడ్స్ నిర్వహించారు. వీరి వద్ద నుంచి రూ. 80 లక్షల వరకు నగదు సీజ్ చేసినట్లు సమాచారం. దీంతోపాటుగా ఫైనాన్సియర్ల ఇళ్లలో ఐదున్నర కోట్ల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు సైతం ఈడీ అధికారులు సీజ్ చేశారు. సురేష్ అగర్వాల్, రక్షిత అగర్వాల్, సీఎస్కే రియల్టర్ ఇళ్లలో ఈడీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు.ఇప్పటికే బీఆర్ఎస్ నేత కేటీఆర్ వ్యవహారం ఈడీ ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో.. హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించడం బి ఆర్ ఎస్ ప్రముఖుల లో ఆందోళన రేకెత్తించాయి.
