సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, తెలంగాణ అసెంబ్లీ లో ఇటీవల పుష్ప 2 సంధ్య థియేటర్స్ వద్ద బెనిఫిట్ షో ఒక మహిళా మృతి నేపథ్యంలో అల్లు అర్జున్ వ్యవహారం చర్చకు వచ్చింది. మజ్లిస్ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. పుష్ప-2 మూవీ సందర్బంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందినా బాధ్యత లేకుండా హీరో సినిమా చూసి అభిమానులకు చేతులు ఊపుతూ వెళ్లారు. ఇందులో పోలిసుల వైఫల్యం ఉంది. ఈ ఘటనలో చర్యలు ఏమి తీసుకొన్నారు అని ప్రశ్నించగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తాను సిఎంగా ఉన్నంత‌కాలం తెలంగాణాలోని ధియేట‌ర్ల‌లో టిక్కెట్ల పెంపు, బెన్ఫిట్ షోలకు అనుమ‌తి ఇచ్చేది లేద‌ని తేల్చి చెప్పారు.ఇటీవల సినీ పరిశ్రమ వారు అల్లు అర్జున్ అంశాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారు? ఈ ఘటనలో అల్లు అర్జున్ తప్పు లేదని పోలిసుల నిర్లక్ష్యం ఉందని విమర్శిస్తున్నారు. ఈ ఘటనలో అల్లు అర్జున్‌కు ఏమైంది.. అంతగా ఇంటికి క్యూకట్టి నన్ను తిడుతున్నారు. అల్లు అర్జున్‌కు కాలు విరిగిందా.?చెయ్యి విరిగిందా? ఆలా బెయిల్ రాగానే అల్లు అర్జున్ కోసం క్యూ కట్టిన సినీ ప్రముఖులు అక్కడ త్రొక్కిసలాటలో చనిపోయిన తల్లి , ఇప్పటికి కోమాలో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాన్నీ మాత్రం ఎవరు పరామర్శించడం లేదు. అసలు సినీ ప్రముఖులు ఏం కోరుకుంటున్నారు?అల్లు అర్జున్‌కు ఏమైంది.. అంతగా ఇంటికి క్యూకట్టి నన్ను తిడుతున్నారు. మీపై నాకు కోపం ఎందుకు ఉంటుంది. సినిమా వాళ్లు ఇకనైనా బాధ్యతగా వ్యవహారించాలి అని సీఎం రేవంత్ రెడ్డి మండి పడ్డారు. ఇక తెలంగాణలో సంక్రాంతి కానుకగా వస్తున్నా గేమ్ చేంజెర్, దాకు మహారాజ్ వంటి సినిమాలకు కలెక్షన్స్ పెద్ద ఎత్తున వచ్చే అవకాశం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *