సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్లో ఇంటింటికి కేబుల్ టివి ప్రసారాలు అందించే ప్రభుత్వ సంస్థ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి సంచలన నిర్ణయం ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక .. . సంస్థ ప్రక్షాళనలో భాగంగా 410 ఉద్యోగులను తొలగించబోతున్నామని చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. సంస్థకు నష్టం కలిగించిన వారిని నుంచి డబ్బు రికవరీ చేస్తామని చెప్పారు. అంతేకాకుండా చంద్రబాబు కు వ్యతిరేకంగా సినిమా లు తీసిన వివాద స్వాద సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కు అక్రమంగా 1కోటి 15 లక్షలు చెల్లించారని ఈ విషయంలో 14 రోజులలో డబ్బు రికవరీ కోసం వర్మకు నోటీసులు పంపామన్నారు. గత వైసీపీ పాలనలో ఏపీ ఫైబర్ నెట్‌ను దివాళా తీయించే పరిస్థితికి తీసుకొచ్చారని ఆరోపించారు సంస్థ చైర్మన్ జీవీరెడ్డి. 2019-2024 మధ్య అవసరం లేకున్నా 1200 మందిని నియమించుకున్నారని తెలిపారు.
