సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ ని వర్షాలు ఇప్పటిలో వదిలేలా లేవు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా బలమైన శీతలగాలులతో ప్రజలు అనారోగ్య పాలవుతున్నారు. వర్షపు జల్లులు పడుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో నేడు, బుధవారం ఉదయము 8.30 గంటకు నైరుతి & ప్రక్కనే ఉన్న పశ్చిమద్య బంగాళాఖాతం దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాలలో కేంద్రీకృతమై ఉన్నది. వచ్చే 24 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడన ప్రాంతంగా క్రమంగా బలహీనపడుతుంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు.తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు కూడా పలు చోట్ల కురిసే అవకాసముంది.
