సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణములో నేడు, గురువారం స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ 36వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఒక తరాన్ని శాసించి ఆదర్శంగా నిలిచిన స్వర్గీయ వంగవీటి మోహనరంగ రాజకీయ పరంగా, సామాజిక పరంగా అందరి మనస్సులో శాశ్వతంగా నిలిచిన వ్యక్తి అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. స్థానిక తహసిల్దార్ కార్యాలయ రోడ్డులోని మోహన్ రంగ విగ్రహం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మోహన్ రంగ అని అన్నారు. రాధా రంగ మిత్ర మండలి జిల్లా గౌరవాధ్యక్షులు ఉండపల్లి రమేష్ నాయుడు, అగ్గిశేట్టి సిడ్ని , బొర్రా బాలాజీ, యిర్రింకి సూర్యారావు, జనసేన పట్టణ అధ్యక్షులు చెన్నమల చంద్రశేఖర్ తదితరులు నివాళ్లు అర్పించారు. అనంతరం వృద్దులకు పేదలకు పండ్లు, దుప్పట్లు, భోజనాలు పంపిణి చేశారు. కార్యక్రమంలో న్యాయవాది బొకూరి విజయరాజు, అగ్గిశెట్టి సాయి, యర్రంశెట్టి శివకృష్ణ, కోయ రాంబాబు, చల్లా రాము, కొప్పినిడి బాబీ, పోకల కిషోర్, రట్నాల శ్రీనివాస్, గంటా సుందర్ కుమార్, విజ్జురోతి రాఘవులు, సుంకర చంద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *