సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత ఇటీవల కాలంలో మాజీ సీఎం జగన్ పర్యటనలలో వేలాది వైసీపీ శ్రేణులు అభిమానులు సందడి ..గత 2 రోజుల క్రితం కర్నూలు, పులివెందులలో జగన్ ను కలవడానికి వచ్చిన అభిమానులను కంట్రోలు చెయ్యలేక పోలీసులు లాఠీ ఛార్జి కూడా చెయ్యవలసి వచ్చింది. మరో ప్రక్క ఊహించని వరంలా కేంద్రంలో ముందస్తు జమిలి ఎన్నికలకు శరవేగంగా మోడీ సారథ్యంలో వేస్తున్న వేగవంతమైన అడుగులు.. జగన్ లో కొత్తజోష్ పెంచినట్లు భావించవచ్చు. ఈ నేపథ్యంలో జగన్ తనతో సమావేశం అవుతున్న వైసీపీ నేతలకు కొందరు నేతల పార్టీ పిరాయింపులతో ఆందోళన చెందవద్దని, జనవరిలో సంక్రాంతి పండుగ వెళ్ళగానే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కి పూర్తీ జవసత్వాలు వచ్చే విధంగా పర్యటిస్తానని, ప్రభుత్వ వైఫల్యాలు ఫై ప్రజలలో అసంతృపి పెరిగిందని, సూపర్ 6 హామీల విఫలతపై ప్రజలలో ప్రశ్నిస్తానని, వైసీపీ నేతలకు హామీ ఇస్తున్నారు. పలువురు కేసులు ఎదురుకొంటున్న నేతలకైతే మీ ప్రాంతాలలో మీకు జరిగిన అవమానాలు, మిమ్ములను బాధిస్తున్న అధికారుల లిస్ట్ ను ‘రెడ్ బుక్’ లలో రాసి ఉంచండని.. ఈ సారి వైసీపీ అధికారంలోకి రాగానే మొదటగా ఆయా ఘటనల్లో అధికారులతో సహా వైసీపీ వ్యతిరేకులను ఎవరిని ఉపేక్షించమని వారికీ భరోసా ఇస్తున్నారు. మొత్తానికి జనవరి చివరి వారం నుండి జగన్ ఏపీ రాష్ట్ర పర్యటన ఖాయంగానే కనిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *