సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సాటి మనిషికి సాయం చెయ్యడం మానవత్వం అంటారు. మరి నోరు లేని ముగా జీవాలకు కూడా తానుంటానని సాయం చేసే వారిని ఏమంటారు? భీమవరం చిన్నమిరం ప్రాంతంలో ఒక ఆవు కంటికి కొన్ని నెలలుగా ఇన్ఫెక్షన్ అయ్యి రక్తం కారుతూ ఇబ్బంది పడడం జరిగింది ఆ ఆవు కంటి గురించి స్థానికులు గోసంరక్షణ అధ్యక్షుడు సుంకరదాసు దృష్టికి తెచ్చారు. ఇక రంగంలోకి గో సంరక్షకులు టీమ్ దిగింది. అయితే అవును పట్టుకోవడం చాలా ఇబ్బంది కలగడంతో రాయలం ఏడుకొండలు సహకారంతో ఆవును పట్టుకొని కోటికలపూడి నరేష్ స్థావరంలో దాన్ని పడుకోబెట్టి.. డాక్టర్ పొండ్రి బాబు కి తెలియజేయడం తో అయన వెంటనే వచ్చి ఆ ఆవు కంటిని పరిశీలించి ఆ కన్ను క్యాన్సర్ రావడం వల్ల కుళ్ళిపోయిందని వెంటనే ఆ కన్నును తొలగించాలని డాక్టర్ గారు సుంకరదాసుకి తెలియజేశారు మరుసటిరోజే పొండ్రి బాబు ఇంకొక నలుగురు డాక్టర్లు సహకారంతో ఆ కన్నును తొలగించారు నిజంగా మానవత్వంతో డాక్టర్ గారు వైద్యం చేయడం చాలా ఆనందకరమని సుంకర దాసు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మోక ఏడుకొండలు మటపర్తి ఏసు తాడిమల్ల సత్యనారాయణ లోకేష్ కానూరి అశోక్ తదితరులు సహకారం అందించారు.
