సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మీరు 10వ తరగతి కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులై, ITI సర్టిఫికేట్ కలిగి ఉంటే చాలు. ఎటువంటి ఎగ్జామ్స్ రాయకుండానే భారతీయ రైల్వేలో ఉద్యోగం (Railway Jobs) చేయాలనుకునే అభ్యర్థులకు (South Central Railway) 4,232 అప్రెంటిస్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించారు. ఇప్పటికే ఈ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ మొదలుకాగా, జనవరి 27, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ scr.indianrailways.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా వివిధ ట్రేడ్‌లలో నియామకాలు జరుగుతాయి.ఈ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. లేదా సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.కానీ అభ్యర్థులందరూ తప్పనిసరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ చేయించుకోవాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ జీతం 20,200 వరకు అందుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *