సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, గురువారం మీడియాతో తో మాట్లాడుతూ.. నిన్న నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి వేలాదిగాతరలివచ్చిన ప్రజానీకానికి దూరప్రాంతాల నుండి రాజకీయ పార్టీలకుఅతీతంగా తరలి వచ్చిన నేతలకు ప్రముఖులకు కృతజ్ఞలు తెలిపారు. గెలుపు ఓటములు సహజం , అధికారం రావడం పోవడం సహజం.. అయితే వీటన్నిటికీ అతీతంగా కొత్త ఏడాది నన్ను కలవడానికి వచ్చిన వారి ఆత్మీయత చూసి.. ఇంకా ఇన్ని వేలమంది అభిమానిస్తున్నారని తెలిసి, ఇన్నివేల మంది శ్రేయోభిలాషులు సంపాదించుకొన్న నా జన్మ ధన్యం అయ్యిందని భావిస్తున్నాను. నా ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. నా నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి కోసం ఏదైనా ఇంకా చెయ్యాలని ఆశయం బలపడింది. నా తండ్రిని మునిసిపల్ చైర్మెన్ గా (10వేల బంపర్ మెజారిటీతో) గెలిపించారు. నన్ను 2 సార్లు ఎమ్మెల్యే గా గెలిపించిన భీమవరం ప్రజలకు ఎప్పటికి రుణపడి ఉన్నాను. నా గెలుపు ఓటములు కు అతీతంగా నా మంచి కోసం సలహాలిస్తూ మనోబలాన్ని పెంచుతున్న నా శ్రేయోభిలాషులకు, కుటుంబ సబ్యులకు, ప్రజలకు 2025లో సకల శుభాలు జరగాలని కోరుకొంటూ.. నాకు మంచి జన్మ ను ఇచ్చిన తల్లి తండ్రులకు ఆ భగవంతునికి కృతజ్ఞలు తెలుపుకొంటున్నాను అన్నారు గ్రంధి శ్రీనివాస్.
