సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ లో చంద్రబాబు సర్కార్ తాజగా నేడు, శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులోనూ ఇవ్వాలని నిర్ణయించింది ఈ మేరకు ఇంగ్లీషు, తెలుగులోనూ GV ఏంఎస్ నెంబర్ 3ను సాధారణ పరిపాలన శాఖ జారీ చేసింది. ప్రభుత్వ పనితీరులో ఉత్తర్వులు కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. 90 శాతం మంది తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్న రాష్ట్రంలో తెలుగులో ఉత్తర్వులు జారీ చేయడం ఉత్తమమని నిర్ణయించింది.ఇకపై ఆంగ్లం, తెలుగు రెండు భాషల్లోనూ ఉత్తర్వులు జారీ చేయాలని వివిధ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో అనువదించడానికి డైరెక్టర్ ఆఫ్ ట్రాన్స్‌లేషన్ సేవలను వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం సూచించింది
