సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ పట్నంలో నేటి బుధవారం మధ్యాహ్నం ప్రధాని మోడీకి ఏపీ సీఎం నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ వరకు రోడ్ షో నిర్వహించారు. అనంతరం సాయంత్రం ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరిగిన సభలో వారు ప్రసంగించారు.మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీబాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో నేడు, పర్యటించారు. ఈ నేపథ్యంలో నేడు విశాఖపట్నంలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. తెలుగులో ప్రసంగం మొదలు పెట్టిన ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఏపీ ఫై తన అభిమానాన్ని చూపించే అవకాశం ఇప్పుడు వచ్చిందని పేర్కొన్నారు. ఆంధ్ర ప్రజల ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఐదేళ్ల తర్వాత ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని., ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజల ఆశలు, ఆశయాలకు మద్దతుగా నిలుస్తామని చెప్పారు. ఏపీతో భుజం భుజం కలిపి నడుస్తామని మోదీ పేర్కొన్నారు. ఇవాళ తలపెట్టిన ప్రాజెక్టులు ఏపీ అభివృద్ధిని సరికొత్త శిఖరాలకు చేరుస్తాయని ప్రధాని మోదీ అన్నారు. 2030లోగా 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడమే మా లక్ష్యమని ప్రధాని తెలిపారు. నవయుగ పట్టణీకరణకు ఏపీ సాక్ష్యంగా మారబోతోందని, విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ డిమాండ్ చాలా కాలంగా ఉందని, చిరకాల కోరిక ఈరోజు నెరవేరిందన్నారు. రైల్వే జోన్ రాకతో వ్యవసాయ, పర్యాటక రంగాలు ఊపందుకుంటాయి అన్నారు,
