సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: సి.పి.ఎం.పశ్చిమగోదావరి జిల్లా నూతన కార్యదర్శిగా భీమవరం కు చెందిన జే.ఎన్.వి.గోపాలన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు… గత మూడు రోజులుగా భీమవరం లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో జరుగుతున్న ఆ పార్టీ జిల్లా 26 వ.మహాసభలు ముగిసాయి.. ఈ సందర్భంగా రాబోయే మూడు సంవత్సరాలకు గాను 25 మందితో నూతన జిల్లా కమిటీని జిల్లా నలుమూలల నుండి హాజరైన 300మంది ప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నార నూతన జిల్లా కార్యదర్శి గా ఎన్నికైన గోపాలన్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఎస్. ఎఫ్. ఐ. అద్యక్షునిగా, డి.వై.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శిగా కూడా సేవలందించారు. ప్రస్తుతం సీఐటీయూ జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు. అలాగే నూతన జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గా బి.బలరాం, చింతకాయల బాబూరావు, కేతా గోపాలన్, కవురు పెద్దిరాజు, బురిడి వాసుదేవరావు, పి.వి.ప్రతాప్, కర్రి నాగేశ్వరరావు లు, జిల్లా కమిటీ సభ్యులుగా దూసి కళ్యాణి,ధనికొండ శ్రీనివాస్,కె.క్రాంతి బాబు, గొర్ల రామకృష్ణ, జక్కంశెట్టి సత్యనారాయణ, మామిడిశెట్టి రామాంజనేయులు, తదితరులు ఎన్నికయ్యారు.
