సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 62 వ ఉత్యవ మహాత్యవాలు ఎల్లుండి 13వ తేదీ సంక్రాంతి పర్వదినం రోజు ప్రారంభం అయ్యి ఏకబిగిగా నీరుల్లి కూరగాయల వర్తక సంఘం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దేవాదాయ శాఖ పర్యవేక్షణలో నెల రోజులు వైభవంగా నిర్వహణ కొరకు ఆలయం ఆవరణలో చలువ పందిళ్లు సెటింగ్స్, లైటింగ్ ఏర్పాట్లు శరవేగంగా పూర్తీ అవుతున్ననేపథ్యంలో.. నేడు, శనివారం జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు భీమవరం DEO M వెంకటేశ్వరావు,RDO K ప్రవీణ్ కుమార్ రెడ్డి, MRO R రాంబాబు , అడిషనల్ sp భీమారావు, వన్ టౌన్ Ci నాగరాజు శ్రీ అమ్మవారి ఆవరణంలో ఉత్యవాల ఏర్పాట్లు పరిశీలించి ప్రతి రోజు వేలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యాలు ,వారికీ వేగంగా, సౌకర్యవంతంగా శ్రీ అమ్మవారి దర్శనం కోసం పలు సూచనలు చేసారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
