సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విదేశీ పర్యాటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ బృందం నేడు, సోమవారం హిల్టన్ హోటల్‌లో స్విట్జర్లాండ్‌లోని భారత రాయబారి మృదుల్ కుమార్‌‌తో సమావేశం అయ్యారు. స్విట్జర్లాండ్‌లో ఫార్మా పరిశ్రమ వంద బిలియన్ డాలర్లకు పైగా విలువ కలిగి ఉందని అన్నారు. ఏపీ ఫార్మా రంగంలో పెట్టుబడులకు సహకరించాలని రాయబారి మృదుల్‌ కుమార్‌ను చంద్రబాబు బృందం కోరారు.ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి అనుకూల వాతావరణం ఉందని మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఏపీలో పారిశ్రామిక ప్రోత్సాహకాలు ప్రకటించామని చెప్పారు. అనుమతులన్నీ 15 రోజుల్లో ఇచ్చేలా వ్యవస్థ ఏర్పాటు చేశామని, త్వరలో AI సాంకేతిక విద్య భవిషత్తు అవసరాల దృష్ట్యా ఏపీలో ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి నారా లోకేష్‌ తెలిపారు ఏపీలో తీరప్రాంతం, విశాలమైన రోడ్లు, ఎయిర్‌ కనెక్టివిటీ ఉందని స్పష్టం చేశారు. ఏపీలో విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులు అభివృద్ధి చేస్తున్నామని త్వరలో భోగాపురం, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు అందుబాటులోకి వస్తాయని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *