సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారికీ దడ పుట్టించిన దేశం గర్వించదగ్గ రియల్ హీరో నేతాజీ సుభాస్ చంద్రబోస్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పరాక్రమ్ దివస్ నిర్వహిస్తున్నారు. సుభాస్ చంద్రబోస్ జయంతి సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు, గురువారం(జనవరి 23) ఆయనకు నివాళులర్పించారు. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం ప్రజలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశాన్ని బలహీనపరిచేందుకు, ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్న శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు ఇచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలో వివిధ పాఠశాలలకు చెంది విద్యార్థులతో ప్రధాని మోదీ ముచ్చటించారు. నేతాజీ గొప్పతనం గురించి వివరించారు, “ఆయన ఎప్పుడూ సుఖవంతమైన జీవితంలో చిక్కుకోలేదు. పూర్తీ భారత్ స్వాతంత్య్రానికి ముందే బోస్ సైన్యం పోరాట పటిమతో తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన నేల అండమాన్. ఇక్కడే తొలిసారి నేతాజీ త్రివర్ణ పతాకం ఎగరేశారని తెలిపారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా అండమాన్ దీవులకు బోస్ పేరు పెట్టడం, ఇండియా గేట్ వద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, ఆయన జయంతిని ‘పరాక్రమ్ దివస్’గా జరుపుకోవడం తదితర కార్యక్రమాలను ఆయన ప్రభుత్వ హయాంలో ప్రధాని ప్రస్తావించారు. భారతదేశ వారసత్వం గురించి బోస్ గర్వపడుతున్నారని ఆయన అన్నారు.
