సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 61 వ వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానికులతో పాటు ప్రక్క రాష్ట్రాల నుండి కూడా ఎంతో దూరప్రాంతాల నుండి భక్తులు శ్రీ అమ్మవారిని దర్శించుకొంటున్నారు. నేడు, శుక్రవారం తమిళనాడు తంజావూరు కి చెందిన మేజర్ S అరుణ్ లావణ్య దంపతులు శ్రీ అమ్మవారిని దర్శించుకొని కానుకగా 72 గ్రాముల 366 మిల్లిలా, బంగారంతో తయారు చేసిన హారాన్ని కానుకగా గా భీమవరం ఎమెల్య పులపర్తి రామాంజనేయులు చేతుల మీదగా శ్రీ అమ్మవారికి అందచేసినారు. వీరికి ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ఆ భక్తులకు ప్రసాదాలు అందించారు. నేడు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి కుటుంబ సభ్యులతో ఆలయ మర్యాదలతో శ్రీ అమ్మవారిని దర్శించుకొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *