సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం వైసీపీ అగ్ర నేత విజయసాయి రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా నేపథ్యంలో త్వరలో మరికొందరు వైసీపీ కీలక నాయకులు ఆ పార్టీని వీడనున్నారని, రాజకీయాల నుంచి తప్పుకుంటారనే ప్రచారం తెరపైకి వచ్చింది. వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఫై కూడా వివాదాస్వాద పోస్ట్ ప్రచారంలోకి వచ్చింది. ఈ నెల 26న కొడాలి నాని కూడా వైసీపీకి రాజీనామా చేస్తారని.. ఆరోగ్య కారణాల దృష్ట్యా రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ గా మారింది. దీనిపై స్వయంగా కొడాలి నాని స్పందించారు. అది ఫేక్ అని తాను వైసీపీ ని వీడేది లేదని. తన గురించి జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. అనారోగ్య కారణాలతో కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్న ప్రచారంలోనూ వాస్తవం లేదన్నారు. అది ఫేక్ పోస్ట్ అని ఆయన తేల్చి చెప్పారు. అది ఎడిటెడ్ న్యూస్ అని, ఫేక్ అని, దాన్ని ఎవరూ నమ్మొద్దని స్వయంగా సోషల్ మీడియాలో మాట్లాడారు.
