సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణములో భూములు, స్థిరాస్తులు రిజిస్ట్రేషన్ విలువలు చాలా అధికముగా ఉన్నయని, భూములు, స్థిరాస్తులు రిజిస్ట్రేషన్ విలువలు పెంపుదల నుండి మినహాయింపు చేయాలనీ ‘ది భీమవరం ఛాంబరు ఆఫ్ కామర్స్ ‘సభ్యులు ఎమ్మెల్యే అంజిబాబును కోరారు. నేడు, మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులకు వినతిపత్రాన్ని అందించారు. కామర్స్ సభ్యులు మాట్లాడుతూ.. భీమవరం జిల్లా కేంద్రముగా ప్రకటించినప్పటి నుంచి ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ విలువలు అత్యధికంగా పెరిగాయని, ప్రస్తుతం భీమవరం పట్టణ పరిసర ప్రాంతముల వారికి ఆదాయ వనరులైన వ్యవసాయం, ఆక్వా తీవ్రమైన ఒడిదుడుకులతో నష్టపోయి ఉన్నాయని, అది గాక రిజిస్ట్రేషన్ విలువలు పెరిగినందున ఆస్థి పన్నులు పెరిగి పోయినవని, రిజిస్ట్రేషన్ విలువలు పెరిగినందున రియల్ ఎస్టేట్ రంగం కూడా దెబ్బతిన్నదని, రిజిస్ట్రేషను విలువల పెంపుదల నుంచి భీమవరం పరిసర ప్రాంతములకు మినహాయింపు యివ్వవలసినదిగా కోరుతున్నామని అన్నారు. భూములు స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ విలువలు పెంపుదల నుండి మినహాయింపు కోరుతూ మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నామని అన్నారు. దీనిపై ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ఈ విషయంపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందని అన్నారు. ఛాంబరు ఆఫ్ కామర్స్ సభ్యులు మానేపల్లి సూర్యనారాయణ గుప్తా, కాగిత వెంకటరమణ, తుమ్మలపల్లి శివ, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
