సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అసలు సిసలయిన భారతీయ మేధాశక్తి తో అత్యుత్తమ అంతరిక్ష సంస్థగా ఎదిగిన ఇస్రో చరిత్రాత్మక మరో మైలురాయిని సాధించింది. ఇస్రో తన వందో ప్రయోగాన్ని నేడు, బుధవారం ఉదయం ప్రయోగించింది. ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రోజు ఉదయం 6-23 గంటలకు GSLV F-15 రాకెట్‌ని ప్రయోగించింది. రెండవ లాంఛ్ ప్యాడ్ నుంచి రాకెట్ నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకుపోయింది. అంతేకాదు ఇటీవల ఆధునిక సాంకేతికత జోడించి ఇస్రో అభివృద్ధి చేసిన NVS-02 నావిగేషన్ ఉపగ్రహాన్ని రాకెట్ నింగిలోకి మోసుకెళ్లింది. భూమికి 36 వేల కి.మీ ఎత్తున GTO ఆర్బిట్‌లో NVS-02 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో ఇస్రో శాస్త్రవేత్తలు, ఉద్యోగుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇస్రోకి ఇది వందవ రాకెట్ ప్రయోగం. కాగా డాక్టర్ నారాయణన్ ఇస్రో ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాక ఇది మొదటి ప్రయోగం. కాగా ఈ ప్రయోగం విజయవంతమైంది. భారత ప్రధాని మోడీ , రాష్ట్రపతి దౌపతి ముర్ము శాస్త్రవేతలుకు అభినందనలు తెలిపారు.
