సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో ఆడపిల్లలపై అత్యాచారాలు, ఆగటం లేదు. నైతిక విలువలకు వలువలు వలుస్తున్నారు తాజాగా మరో.. సభ్యసమాజం సిగ్గుపడే ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్‌లోకి గుర్తుతెలియని దుండగులు గత గురువారం రాత్రి 8 గంటల సమయంలో అక్రమంగా ప్రేవేశించి బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న హాస్టల్ విద్యార్థినిపై హాస్టల్ ప్రాంగణంలో దారుణానికి ఒడిగట్టారు. హాస్టల్‌లో అందరూ ఉండగానేవారిని భయపెట్టి యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. తరువాత కామాంధులు అక్కడ్నుంచి పరారయ్యారు. వారి దాడిలో తీవ్రంగా గాయపడిన సదరు యువతి అపస్మారక స్థితికి చేరుకుంది. దీనితో తోటి విద్యార్థినిలు వసతిగృహం సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో బాధితురాలిని హుటాహుటిన రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హాస్టల్ భవనంలోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తులు ఎవరు, వారు ఆ అమ్మాయినే ఎందుకు టార్గెట్ చేసారు. నిందితులు వెనుక ఎవరు ఉన్నారు. అనే పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
