సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గత నెల రోజులుగా కోళ్ల పౌల్టీ లలో లక్షలాదిగా కోళ్లు చనిపోవడం పౌల్ట్రీ యజమానులును ఆందోళనకు గురిచేస్తుంది. సహజంగా లక్ష కోళ్ళలో రోజు 30 నుండి 40 కోళ్లు మరణించడం సహజంగా భావిస్తారు. అయితే ఏ వ్యాధి లక్షణాలు లేకుండా ప్రతి రోజు గుడ్లు పెట్టిన వెంటనే కొన్నివందల కోళ్లు కుప్పకూలి మరణించడం తో అసలు ఇది ఏ వ్యాధో అంతుచిక్కక రైతులు ఆందోళన చెందుతున్నారు, తణుకు, అత్తిలి, ఉంగుటూరు , ఇరగవరం ,పెరవలి , తాడేపల్లి గూడెం పరిసర ప్రాంతాలలో పౌల్ట్రీ లు వందలాదిగా ఉన్నాయి. ఇటీవల ఉంగుటూరు లో ఒక పౌల్ట్రీ లో రోజుకు15వేలుకు చప్పున లక్షన్నర కోళ్లు చనిపోవడం నిర్వాహకులు ను విస్తుపోయేలా చేసింది. దాదాపు అన్ని చోట్ల ఇదే తరహా గ లక్షలాది కోళ్లు మరణించినట్లు సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లాను అనుకోని తూర్పు గోదావరి జిల్లాలో కూడా పలు పౌల్ట్రీ లలో ఇదే తరహా లక్షల కోళ్ల మరణాలు సంభవిస్తున్నాయి. శీతల గాలులు లో వైరస్ విజృంభణ సహజమే .. గతంలో వచ్చిన బర్ద్ ఫ్లూ తరహాలోనే తరహాలో కోళ్లు చనిపోతున్నాయి. కానీ .. కచ్చితమైన వ్యాధి నిర్ధారణ వైద్యులు చేయలేకపోతున్నారు. మెల్లగా ఎండలు ముదురుతున్నాయి.మరో ప్రక్క చికెన్ ధరలు, కోడి గ్రుడ్ల ధరలు పడిపోతున్నాయి. ఇది పౌల్టీ యజమానులకు ఆందోళనకు గురిచేస్తుంది.
