సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల వైసీపీ అధినేత జగన్ లండన్ నుండి తిరిగి వచ్చాక పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు,,చేర్పులు మార్పులు, నూతన జరిగిన నియామకాల నేపథ్యంలో కీలకమైన పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా భీమవరం పట్టణానికి చెందిన కోడే విజయలక్ష్మి ని నియమించడం జరిగింది. ఆమె గతంలో ప్రతిష్టాకరమైన గునుపూడి పంచారామ క్షేత్రం సోమేశ్వర స్వామి దేవాలయానికి ధర్మకర్తల మండలి చైర్మెన్ గా వ్యవహరించడం జరిగింది. ఆమె భర్త మాజీ మునిసిపల్ కౌన్సిలర్, సీనియర్ వైసీపీ నేత, జిల్లా బిసి నేత కోడె యుగంధర్ కావడంతో వైసీపీ శ్రేణులు కోడె దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
