సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అరుంధతి పేటలో గత 2 రోజులుగా ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో కర్రలతో దాడులు ప్రతిదాడులు రాళ్ళూ విసురుకొని పలువురు గాయపడటం జరుగుతుండటంతో పోలీసులు నర్సాపురం లో తాజగా 144 సెక్షన్ విధించారు. వివరాలలో వెళ్ళితే .. అరుంధతీపేటలో మొన్న గురువారం రాత్రి ఓ వివాహం జరుగుతోంది నేపథ్యంలో మోటారు బైక్‌పై అటుగా వెళుతున్న ఓ వ్యక్తి హారన్ కొట్టడంతో స్థానికులు అభ్యన్తర పెట్టడంతో మొదలయిన గొడవ స్థానికంగా రెండు సామాజిక వర్గాల గొడవగా మారి కొట్లాటలు వరకు వెళ్ళింది. . గత శుక్రవారం సాయంత్రం ఇరువర్గాల మధ్య మళ్లీ ఘర్షణలకు దిగాయి. కర్రలు, రాళ్లతో ఒకరిపై ఒక్కరూ దాడికి పాల్పడారు. రెండు వర్గాలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనలు చేశారు. ( ఈ ఘర్షణకు వైసీపీ టీడీపీ పార్టీల రంగులు కూడా పులుముకొంది)పట్టణంలో ఆందోళనకర వాతావరణం ఏర్పడింది. . అంతర్వేది ఉత్సవాల సందర్భంగా నరసాపురం రేవులో బందోబస్తులో వున్న నరసా పురం డీఎస్పీ శ్రీవేదకు సమాచారం రావడంతో అక్కడ గస్తీ నిర్వహిస్తున్న పోలీసుల్లో కొందరిని అరుంధతి పేటకు తరలించి ఇరు వర్గాలను చెదరగొట్టారు.. అడ్డువచ్చిన పోలీ సులపై రాళ్లు రువ్వారు. దీంతో అదనపు పోలీస్‌ల ను రప్పించి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ఇక్కడ 144 సెక్షన్ విధించి గస్తీ ఏర్పాటు చేశారు. ఇరు వర్గాల దాడులతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానిక ప్రభుత్వా సుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
