సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాకు ‘కింగ్‌డమ్’ (Kingdom) అనే టైటిల్ ఖరారు చేసినట్లు నిర్మాతలు టీజర్ విడుదల చేసి అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా టీజర్ తెలుగు వెర్షన్‌కి జూనియర్ ఎన్టీఆర్, తమిళ వెర్షన్‌కి సూర్య, హిందీ వెర్షన్‌కి రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ అందించారు. ఈ ముగ్గురు స్టార్లు తమ గొంతుతో సినిమా కధ ఫై ఆసక్తి పెంచేలా టీజర్‌ను మరో స్థాయికి తీసుకువెళ్లారు. తెలుగులో జూ ఎన్టీఆర్ గంబిరంగా RRR తరహాలో టీజర్ కు ఇచ్చిన వాయిస్ ఓవర్ సినిమా ఓపెనింగ్స్ పెరగడానికి తప్పని సరిగా హెల్ప్ చేస్తుంది.మే చివరి వారంలో ‘కింగ్‌డమ్’ విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. “కింగ్‌డమ్’ పిరియాడికల్ చిత్రానికి ఎట్టి పరిస్థితులలో హిట్ కొట్టవలసిందేనని విజయ్ దేవరకొండ కస్టపడి పనిచేస్తున్నారు. ఆయన గెటప్, కెజిఎఫ్ తరహా టేకింగ్ తో,మొత్తం తగలెట్టేస్తాను అంటూ చెప్పిన డైలాగ్ గుర్తుండిపోతాయి.
