సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు భీమవరం పట్టణంలో “స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మూడో శనివారం నిర్వహించ తలపెట్టిన “స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమమును “సోర్స్- రిసోర్స్ * అనే ఇతివృత్తంగా నేటి శనివారం ఉదయం స్థానిక 20వ వార్డు కొత్త బస్ స్టాండ్ ఎదురుగా గల S.J.G.M హై స్కూల్ మైదానంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భీమవరం పురపాలక సంఘ కమిషనర్, అధికారులు మరియు స్వచ్ఛంద్ర సేవా సంస్థల వారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఇంటి వద్దనే వ్యర్ధాలను వేరు చేయుట గురించి, ఇంటి వద్దనే తడి చెత్తను హోం కంపోస్ట్ గా మార్చుకునే విధానం మరియు నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో ఉపయోగించవలసిన ప్రత్యామ్నాయ పర్యావరణహిత వస్తువుల గురించి అధికారులు వివరించారు.
