సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గోదావరి జిల్లాల తో పాటు బర్ద్ ఫ్లూ వ్యాధి ఏపీలోని తెలంగాలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించి వేలాది కోళ్లు చనిపోతుండటంతో తెలుగు రాష్ట్రాలలో పలు జిల్లాల్లో చికెన్ తినటంపై నిషేదం విధించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమై ఏపీ సరిహద్దు నుండి పౌల్ట్రీ కోళ్ల తో వస్తున్నా వాహనాలను సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిలిపివేస్తోంది. అంతేకాకుండా పొరుగురాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి వస్తున్న కోళ్లు, బాతుల వాహనాలను అడ్డుకొని తిరిగి వెనక్కి పంపుతున్నారు. ఎక్కడైనా కోళ్లు అనారోగ్యంతో మరణిస్తే వెంటనే సమాచారం అందించేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 9100797300 విడుదల చేశారు. చనిపోయిన కోళ్లను సురక్షితంగా పూడ్చిపెట్టాలని అధికారులు సూచించారు. దీనితో చికెన్ తినేవారు లేక తెలుగు రాష్ట్రాల్లో భారీగా చికెన్‌ విక్రయాలు తగ్గాయి. గతంలో కిలో రూ.280వరకు పలికిన చికెన్ ప్రస్తుతం రూ.150కి చేరింది.అయినా కొనేవారు కరువయ్యి దుకాణాలు మూతపడ్డాయి. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కారణంగా మాంసం ప్రియులు కేజీ 800-1000 ధర పలుకుతున్న మటన్‌ వైపు చూస్తున్నారు. మరి అంత ధర చెల్లించలేనివారు మరికొందరు చేపలుతో ఈ ఆదివారం సరిపెడుతున్నారు. చికెన్ తినకపోవడంతో బిర్యానీ రెస్టారెంట్ వ్యాపారులకు భారీ నష్టం జరుగుతుంది, దీంతో గత వారం రోజుగా ఎక్కడ చూసినా మంచి డిమాండ్ తో చేపల మార్కెట్లు కిక్కిరిసిపోతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *