సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర మంత్రి ,నరసాపురం ఎంపీ ,భూపతిరాజు శ్రీనివాస వర్మ తాజాగా విడుదల చేసిన ట్విట్ లో .. గత రాత్రి ఢిల్లీలో జరిగిన త్రొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తున్నాను. ఈ దుఃఖ సమయంలో నా ఆలోచనలు కుంభమేళా కు వెళ్లాలని తపించి త్రొక్కిసలాట లో మరణించిన కుటుంబాల వెన్నంటే ఉండిపోయాయి. ఈ ఘటన నా మనస్సు ను తీవ్రంగా కలచివేసింది. త్రొక్కిసలాటలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని వేడుకొంటున్నాను అన్నారు.
