సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్, ప్రతిపక్ష నేత జగన్ హాజరు అయ్యారు. అసెంబ్లీ, శాసనమండలి ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ( అసెంబ్లీ లో కూటమి సభ్యులు భారీ సంఖ్యలో ఉండగా, శాసనమండలి లో వైసీపీ సభ్యులు భారీ సంఖ్యలో ఉన్న విచిత్ర పరిణామం అందరికి తెలిసిందే ) గవర్నర్ తన ప్రసంగంలో సీఎం చంద్రబాబు పేరును నరేంద్ర చంద్రబాబు గా తప్పుగా పలికారు. ఇక ఎన్నికల్లో ప్రజలు తమ కూటమి ప్రభుత్వానికి తిరుగులేని చరితాత్మక మెజారిటీ ఇచ్చారని.. ప్రజలు కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని తెలిపారు. గత ఐదేళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైందని తెలిపారు.రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నామని గవర్నర్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశామని.. అన్నక్యాంటీన్లు తెచ్చి పేదల ఆకలి తీరుస్తున్నామని అన్నారు. దేశంలోనే ఐటీలో ఏపీని టాప్‌లో నిలిపేలా కొత్త ఐటీ పాలసీ తీసుకొచ్చామని. 2029 నాటికి విశాఖలో 46 కి.మీ మెట్రో నిర్మాణం జరుగుతుందని, విజయవాడలో 38.40 కి.మీ మెట్రో రైల్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఎనర్జీ రంగంలో 7.5 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమన్నారు. 3 నెలల్లోనే 17,605 కిలో మీటర్ల రోడ్లకు మరమ్మతులు చేపట్టామన్నారు. 2025-26లో విద్యుత్ ఛార్జీల పెరుగుదల ఉండదని తెలిపారు. 20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు చేశామన్నారుకూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని ఆర్ధిక పరిస్థితి ని గాడిలో పెడుతున్నామని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా.. ప్రజల సమస్యలు అసెంబ్లీ లో వినిపించకుండా చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యేలుమరియు వైసీపీ ఎమ్మెల్సీలు తీవ్ర నిరసనగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. తదుపరి తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు నిరసనగా జగన్ అసెంబ్లీ నుండి వాకౌట్ చేసారు,
