సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:నేడు, సోమవారం ఏపీ అసెంబ్లీ లో డిప్యూటీ స్పీకర్ రఘురామా కు భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు చేసిన విజ్ఞప్తి ఏమిటంటే.. గత వైసీపీ ప్రభుత్వం భీమవరం నియోజక వర్గంలో పంట కాలువలలో ఒక తట్ట చెత్త గాని తుడు గాని తీయలేదని దాని పర్యవసానంవీరవాసరం మండలంలో శివారు ప్రాంతాలలో పొలాలకు నీరు అందక రైతులు పంట వెయ్యడం మనుకొంటున్నారని దీని వల్ల మొదటి క్రాప్ చేయలేదని, ఇప్పుడు కాలువలు సాగు, తాగు నీరు, మురుగు నీరు బయటికి వెళ్ళడానికి వీలు లేదన్నారు. అన్నపూర్ణగా ఉండే డెల్టా ప్రాంతం ఎడారిగా మారే పరిస్థితి వచ్చిందని, దీనిపై యుద్ధ ప్రాతిపదికన డెల్టా మోడరాజేషన్ తీసుకుని పూర్వం కాలువలు ఏ విధంగా ఉన్నాయో ఆ స్థాయికి రావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు. దానికి స్పీకర్ స్తానం లో ఉన్న రఘురామా మాట్లాడుతూ.. అసలు కారణం మన ప్రాంతంలో పంటకాలువలు ఆక్రమణలు గురి కావడం అని గమనించాలని ఆ ఆక్రమణలు తొలగించే ఏర్పాట్లు మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పట్టాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించాలని సూచించారు. ( ఉండి నియోజక వర్గంలో ఎమ్మెల్యే గా గెలవగానే రఘురామా స్వయంగా రంగంలోకి దిగి యుద్ధప్రతిపాదికన కాలువలకు అడ్డువచ్చిన ఆక్రమణలు తొలగించడంలో దూకుడుగా జిల్లాలోనే ముందున్నారు)
