సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 6 ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రకియలు దాదాపు పూర్తీ కావచ్చింది. ఏపీలో 3 ఫలితాలు వెలువడ్డాయి. వాటిలో 2 స్థానాలు కూటమి బలపర్చిన అభ్యర్థులు గెలిచారు. గోదావరి జిల్లాలు, కృష్ణ గుంటూరు జిల్లాల 2 స్థానాలు కూటమి మద్దతు అభ్యర్థులు గెలుచుకొన్నారు. ఒక ఉత్తరాంధ్ర లో మాత్రం కూటమి బలపర్చిన ఓటమి చెందారు.. ఉత్తరాంధ్ర, నల్గొండ-ఖమ్మం-వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థులు గెలుపు సాధించారు. ఉత్తరాంధ్రలో గాదె శ్రీనివాసులు నాయుడు సత్తాచాటగా, నల్గొండ-ఖమ్మం-వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీపాల్ రెడ్డి గెలుపొందారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. కరీంనగర్ టీచర్ MLCగా మల్క కొమురయ్య గెలుపొందారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో కొమురయ్య గెలిచారు.ఇంకా ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల ఎన్నికల ఫలితాలు వెలువడవల్సి ఉంది, ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ హోరాహోరీ తలపడుతున్నాయి. బీజేపీ అభ్యర్థి విజయపధంలో ఉన్నారు బీఎస్పీ 3వ స్తానం లో ఉంది
