సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 3 దశాబ్దాలు పైగా ఇద్దరు తోడు అల్లుళ్ల మధ్య రాజుకున్న విభేదాలుకు, తీవ్ర స్థాయి విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టారు. గతంలో ఎన్టీఆర్ తెలుగు దేశం తరపున లక్ష్మి పార్వతి మద్దత్తు తో రాజ్యసభ సభ్యుడు అయిన దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఆత్మకథలో చంద్రబాబు నైజం గురించి చేసిన వివాదాస్వాద వ్యాఖ్యలు కూడా మర్చిపోయారు. పెద్ద అల్లుడు దగ్గుబాటి ఇంటికి వచ్చి ఆత్మీయంగా పిలవగానే ఆయన రాసిన ‘ప్రపంచ చరిత్ర’ వైజాగ్ లో నేడు, గురువారం జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కావడమే కాదు, అయన దగ్గుబాటి ని ప్రశంసల వర్షంలో ముంచెత్తి ఆలింగనం చేసుకోవడం గమనార్హం.చంద్రబాబు మాటలలో..‘‘దగ్గుబాటి వెంకటేశ్వరరావు నా తోడల్లుడు. ఎన్టీఆర్ వద్ద ఇద్దరం అన్నీ నేర్చు కున్నాం .ఆయన పుస్తకం రాస్తారని నేనెప్పు డూ అనుకోలేదు. ఎవరూ చేయని సాహసాన్ని ఆయన చేశారు.ప్రపంచతత్వం, నాయకత్వంపై అధ్యయనం చేసి చక్కగా పుస్తకం రాశారని ప్రశంసించారు. ఈ కార్య క్రమం లో దగ్గుబాటి భార్య రాష్ట్ర బీజేపీ అడ్జక్షురాల , ఎంపీ పురంధరేశ్వరి మరియు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, బాలయ్య చిన్న అల్లుడు ఎంపీ భరత్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *