సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం కన్వెన్షన్ హాలులో నేడు, ఆదివారం BCN కేబుల్ నెట్ వర్క్ చైర్మెన్ రుద్రరాజు శ్రీనివాస్ రాజు కుమారుడు లోకేష్ వర్మ, అనన్య ల పెళ్లివేడుకలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంఎస్ ఓలు, కేబుల్ టివి ఆపరేటర్స్ శాటిలైట్ ఛానెల్స్ నిర్వాహకులతో, సంచలన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, RX 100అజయ్ భూపతి వంటి సినీ ప్రముఖులతో సందడిగా జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనమండలి చైర్మెన్ మోషేను రాజు, ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, తోట సీతారామ లక్ష్మి, మెంటే పార్ధ సారధి, జనసేన చినబాబు, వైసీపీ జిల్లా అడ్జక్షులు ప్రసాదరాజు, కొత్తపల్లి నాగరాజు,వ్యాపార ప్రముఖులు తదితరులు హాజరు అయ్యారు. తణుకు వేదికగా రాష్ట్రంలో ప్రముఖ కేబుల్ నెట్ వర్క్ TCN చైర్మెన్ చిట్టూరి కన్నబాబు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా నూతన దంపతులకు శ్రీనివాస రాజు గారి కుటుంబానికి మన సిగ్మా ఆన్ లైన్ న్యూస్ తరపున సిగ్మా ప్రసాద్ శుభాభినందనలు తెలియజెయ్యడం జరిగింది. ఈ పెళ్లి వేడుకలలో రాంగోపాల్ వర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయన చుట్టూ యువతి యువకులు చేరి సెల్ఫీ లు దిగటంతో గంటకు పైగా గడిపారు.
