సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జిల్లాలో అర్హులైన పేదలకు ఇళ్ళ స్దలాలు ఇవ్వాలని కోరుతూ శనివారం సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో భీమవరంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి డిమాండ్స్ తో కూడిన వినతిపత్రాన్ని, ఇళ్ళ స్థలాల వ్యక్తిగత అర్జీలు జిల్లా కలెక్టర్ కార్యాలయం పరిపాలనాధికారి హెచ్. చంద్రశేఖర్ కు అందజేశారు. ధర్నా నుద్దేశించి భీమారావు మాట్లాడుతూ ఇళ్ల స్థలాలపై ఎన్నికల్లో కూటమి నాయకులు ఇచ్చిన హామీ మేరకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ళ స్థలాలిచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు కేటాయించి పేదల స్వంత ఇంటి కల నెరవేర్చాలన్నారు. అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు ఇచ్చేవరకు సీపీఐ పోరాడుతుందన్నారు. జగనన్న నివేశనా స్థలాల్లో ఇంకా ఇళ్లు నిర్మించుకోలేని లబ్ధిదారులకు కూడా పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలాలు ఇవ్వాలని భీమారావు డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర నాయకులు నెక్కంటి సుబ్బారావు , సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు కలిశెట్టి వెంకట్రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లబోయిన రంగారావు, ఎం.సీతారాంప్రసాద్, జిల్లా సమితి సభ్యులు తదితరులు అర్జీదారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *