సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అసెంబ్లీ లో కేవలం 11 సభ్యుల బలం ఉన్న వైసీపీ సమావేశాలకు దూరంగా ఉంటుంది. అయితే శాసనమండలి లో మాత్రం మొత్తం 58 స్థానాలకు శాసన మండలి చైర్మెన్ కొయ్యే మోషేను రాజు తో కలపి 43 సభ్యులతో వైసీపీ తిరుగులేని ఆధిక్యత లో ఉండగా లెఫ్ట్ పార్టీలకు చెందిన 5 గురు సభ్యులు ఉంటె టీడీపీ జనసేన కు కలపి కేవలం 10,మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఈనేపథ్యంలో టీడీపీ మంత్రులు అందరు శాసనమండలికి హాజరు అయ్యి వైసీపీ ని బొత్య సత్యనారాయణ సారధ్యంలో వైసీపీ సభ్యుల బలగాన్ని దీటుగా ఎదుర్కొంటున్నారు. దీనితో ఇటీవల ప్రజలలో శాసనమండలి కి పెరిగిన ప్రాధాన్యత అందరికి తెలిసిందే.. అయితే శాసనమండలి లో కూడా కూటమి సభ్యుల ఆధిక్యత చూపి చైర్మెన్ సీటు లి అవిశ్వాస తీర్మానం పెట్టె యోచనకు కూటమి నేతలు కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే నలుగురు వైసీపీ ఎమ్మెల్సీ లు పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ లు వైసీపీ పార్టీకి పదవులకు రాజీనామా చేసారు. అయితే వారి రాజీనామాలు చైర్మెన్ మోషేను రాజు ప్యూహాత్మకంగా ఆమోదించలేదని తెలుస్తుంది. తాజగా నేడు, బుధవారం మరో వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పార్టీకి రాజీనామా చేశారు. దీనితో వైసీపీ అసంతృప్త ఎమ్మెల్సీల సంఖ్య ఐదుకు చేరింది. అయినప్పటికీ ప్రస్తుతం వైసీపీ బలం 37 మించి తగ్గదు. అయితే ప్రజాస్వామ్య బద్దంగా నైతికంగా జంపింగ్ జిలానీల రాజకీయ చేష్టలు సమంజసం కాకపోయిన..సభ నిర్వహణలో మోషేను రాజు సమర్థవంతంగానే ఉన్నపటికీ.. కాల గమనంలో మెల్లగా పెరగనున్న కూటమి బలం చంద్రబాబు మార్క్ రాజకీయాలను ఊహించలేం కదా? అయితే క్యాడర్ లో జగన్ ప్రాబల్యం, వైసీపీ ఎమ్మెల్సీ లకు పెద్దన్నగా ‘ సర్వ సమర్ధుడు’ బొత్స మార్క్ రాజకీయం కూడా తక్కువ అంచనా వెయ్యలేం
