సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:భీమవరం పట్టణం, నియోజకవర్గం లోని పలు ప్రాంతాలలో గత 2 నెలలుగా ప్రధాన రోడ్ల ప్రక్కన ఆక్రమణలు తొలగిస్తున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో నౌడూరు గ్రామా ప్రధాన రోడ్డు విశాలం చెయ్యడం కోసం సెంట్రల్ వద్ద ఆక్రమణలు తొలగింపు ను భారీ పోకేయిన్లతో అధికారులు కొనసాగిస్తున్నారు. అయితే ఆక్రమణలు తొలగింపులో స్థానికులు కొందరు తీవ్ర అభ్యన్తరాలు వ్యక్తం చెయ్యడం కోర్ట్ లో స్టే ఉన్నప్పటికీ తొలగిస్తున్నారని కొందరు ఆందోళనలకు దిగుతుండటంతో భారీగా పోలీసులు మోహరింపు మధ్య మార్క్ చేసిన ఆక్రమణలును అధికారులు ఉద్రికతల మధ్య తొలగిస్తున్నారు.
