సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎఐటియుసి విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నేడు, గురువారం భీమవరం చినరంగనిపాలెం యూనియన్ బ్యాంకు నుంచి విద్యుత్ ఎస్ఇ కార్యాలయం వరకు ప్రదర్శన,విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి డిమాండ్స్ తో కూడిన వినతి పత్రంను విద్యుత్ ఎస్.ఇ.ఆలపాటి రఘనాధ్ బాబు, డి. ఇ.నరహరశెట్టి వెంకటేశ్వరరావు లకు సమర్పించారు. ఇటీవల కూటమి ప్రభుత్వం విద్యుత్ స్మార్ట్ మీటర్స్ పేరుతో విద్యుత్ మీటర్ రీడర్లను రోడ్డున పడేయవద్దని, ఏ రాష్ట్రంలో లేని స్మార్ట్ మీటర్లు మనపై రుద్దడం దారుణమని,నాడు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించి ఇది ప్రజా ప్రయోజనాలకు అరిష్టమని పెడ బొబ్బలు పెట్టిన నారా లోకేష్ ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు మీటర్ రీడర్స్ పొట్టలు కొట్టొద్దని, వారికి సంస్ధలోనే ప్రత్యామ్నాయం చూపి ఉద్యోగ భద్రత కల్పించాలని విద్యుత్ మీటర్ రీడర్స్ జిల్లా గౌరవాధ్యక్షులు కోనాల భీమారావు డిమాండ్ చేశారు. తమ అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసారు.విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ భీమవరం డివిజన్ అధ్యక్షులు పెనుమాక జాకబ్, ఎఐటియుసి జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లబోయిన రంగారావు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.సీతారాంప్రసాద్,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *