సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత కొద్దీ రోజులుగా రోజు రోజుకుపెరుగుతూ వస్తున్న బంగారం ధరలు నేడు మంగళవారం ఉదయం నుండి (25-03-2025) భారీగా తగ్గుముఖం పట్టాయి. https://bullions.co.in/ ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,566 ఉండగా.. ఇవాళ రూ.80,117కు తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు నిన్న రూ.87,890 కాగా.. ఈరోజు రూ.87,400కు పడిపోయింది. ఇక తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారం రూ.80,841 కాగా.. నేడు రూ.80,383కు తగ్గింది. 24 క్యారెట్ల తులం బంగారం ధర నిన్న రూ.88,190 ఉండగా.. ఈరోజు రూ.87,690కు పడిపోయింది. వెండి ధరలు కూడా దిగివస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో తాజగా .97,470కు తగ్గింది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి సోమవారం రూ.98,060 ఉండగా.. నేడు రూ.97,790కు దిగి వచ్చింది.
