సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఆ పార్టీ నాయకత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. నేటి శనివారం మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో వేడుకలులలో పాల్గొన్న పార్టీ అధినేత , సీఎం చంద్రబాబు పార్టీ జెండాను ఆవిష్కరించి, వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఆవిర్భావ సభను ప్రారంభించారు. చంద్రబాబు మాట్లాడుతూ.. స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మాభిమానం కోసం స్థాపించిన తెలుగుదేశం కేవలం కార్యకర్తల అండదండలతో వారి సంకల్పబలంతో నడుస్తుందని, 43 ఏళ్లుగా తెలుగు ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్న పార్టీ..మన తెలుగుదేశం పార్టీ అని, పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం తప్ప వేరే మాట వినిపించని గొంతుక ఉండే కార్యకర్తలు ఉన్న ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం అని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు.. ఆ తరువాత అని ప్రతి ఒక్కరు గుర్తించే పరిస్థితి ఉందని, ప్రజల జీవితాల్లో ఆ స్థాయి మార్పులు తెచ్చిన ఏకైక పార్టీ తెలుగు దేశం అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కోటికి పైగా సభ్యత్వాలతో అసాధారణ రికార్డును సృష్టించి.. తెలుగువాడి పౌరుషంలా రెపరెపలాడుతున్న తెలుగుదేశం పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తలకు, నాయకులకు సెల్యూట్ చేస్తున్నానన్నారు.
